Cinema news: ‘భీమ్లా..’ పవర్‌ఫుల్‌ పోస్టర్‌.. ‘గని’ కొడితే!

సంక్రాంతి పండుగని, సినిమాలని వేరు చేసి చూడలేం. ఈ పండుగలో సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతుంటాయి. మరికొన్ని చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు విడుదల అవుతుంటాయి. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ.. సంకాంత్రి శు

Published : 16 Jan 2022 03:44 IST

సంక్రాంతి పండుగని.. సినిమాలని వేరు చేసి చూడలేం. ఈ పండుగకు సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సంకాంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని సినిమా పోస్టర్లు, వీడియోలు విడుదలయ్యాయి..

యాంగ్రీ ‘భీమ్లా నాయక్‌’

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. జనవరి 12నే విడుదల కావాల్సిన ఆ చిత్రం.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో నిరుత్సాహంలో ఉన్న అభిమానుల్లో జోష్‌ నింపేలా చిత్రబృందం సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌, రానా ఇద్దరూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ రూపొందుతోంది. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘గని’తో తమన్నా

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొడితే.. ’ లిరిక్స్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. తమన్‌ స్వరపర్చిన ఈ ప్రత్యేక గీతంలో తమన్నా ఆడిపాడింది. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని