Tollywood: సంతోష్‌కి ‘అన్నీ మంచి శకునములే’

‘ఏక్‌ మినీ కథ’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు సంతోష్‌ శోభన్‌. ఈ యంగ్‌ హీరోతో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే విషయం తెలిసిందే.

Published : 05 Jul 2021 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఏక్‌ మినీ కథ’తో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు సంతోష్‌ శోభన్‌. ఈ యంగ్‌ హీరోతో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కథకి ‘అన్నీ మంచి శకునములే’ అనే పేరు ఖరారైంది. మాళవిక నాయర్‌ కథానాయిక. మోషన్‌ పోస్టర్‌లో.. ఆహ్లాదరకరమైన తేయాకు తోటల మధ్య రైలు ప్రయాణించే సుందర దృశ్యాలు కనిపిస్తాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తోంది.

వెన్నెల కిశోర్‌, రావు రమేశ్‌, నరేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వప్న సినిమాస్‌, మిత్రవింద మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఏక్‌ మినీ కథ’ అందించిన విజయంతో మరికొన్ని కథల్నీ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు సంతోష్‌. ‘వర్షం’, ‘బాబీ’ తదితర చితాల్ని తెరకెక్కించిన దర్శకుడు దివంగత శోభన్‌ తనయుడే ఈ సంతోష్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు