Shah Rukh Khan: అతడు ఎన్నో ఏళ్లుగా మాకు అండగా ఉంటున్నాడు: షారుక్‌

షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన సినిమా ‘పఠాన్‌’(Pathaan). ఈ చిత్రం  విడుదల కానున్న నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు.

Published : 24 Jan 2023 17:32 IST

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) పేరు వినిపిస్తోంది. ఈ కింగ్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘పఠాన్‌’ విడుదలకు సిద్ధమైంది. షారుక్‌ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ఈ మూవీ రేపు(జనవరి 25) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన దగ్గరి నుంచి ప్రచారం మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా జోరు పెంచింది. అందులో భాగంగా షారుక్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అజయ్‌దేవ్‌గణ్‌ (Ajay Devgn) వీడియోను షేర్‌ చేశాడు.

అందులో అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ..‘‘ఇటీవల విడుదలైన ‘దృశ్యం2’ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నప్పుడు చాలా సంతోషం వేసింది.  అలా హిట్‌ అయ్యే సినిమాలు ఇండస్ట్రీకి ఇవ్వాలని అనుకున్నా. ఏ సినిమా విడుదలైనా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. త్వరలోనే ‘పఠాన్‌’(Pathaan) విడుదలవ్వనుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ భారీగా ఉన్నాయి. ఆ సినిమా హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఇక ఈ వీడియోపై స్పందించిన షారుక్‌ ‘‘అజయ్‌ ఎన్నో సంవత్సరాలుగా నాకు, నా కుటుంబానికి అండగా ఉంటున్నాడు. అతడు ఓ అద్భుతమైన నటుడు’’ అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని