Shah Rukh Khan: తనే నా మొదటి ప్రేయసి.. నెటిజన్‌ ప్రశ్నకు షారుక్‌ సమాధానం

షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన సినిమా ‘పఠాన్‌’(Pathaan). ఈ చిత్రం  విడుదల కానున్న నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు.

Updated : 13 Jan 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan)  ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ కింగ్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘పఠాన్‌’(Pathaan). షారుక్‌ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఇందులో భాగంగా షారుక్‌ ట్విటర్‌లో తన అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్‌ ఎస్‌ఆర్‌కే(Ask SRK) అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

పఠాన్‌ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారు?

షారుక్‌: సినిమాకు అంగీకరించినప్పుడు ఎంత అన్నారో.. అంతే తీసుకున్నా.

మీ కుటుంబం పఠాన్‌ సినిమా చూసిందా? వాళ్ల రియాక్షన్‌ ఏంటి?

షారుక్‌: ఇప్పటి వరకు టెక్నిషియన్స్‌ మాత్రమే పఠాన్ చూశారు. ఇంకెవ్వరూ చూడలేదు. 

మీరు మీ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకుంటారు?

షారుక్‌: నేను నా కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నా. దీన్ని నాకు కాలమే నేర్పింది.

మీకు హాకీ అంటే ఇష్టమేనా? ఒడిశాలో జరిగే హాకీ ప్రపంచకప్‌ చూడటానికి వస్తారా?

షారుక్‌: నాకు రావాలని ఉంది. కానీ పనిలో బిజీగా ఉన్నందు వల్ల రాలేకపోతున్నా

‘పఠాన్‌’లో మీ లుక్‌ కోసం ఎన్నిరోజులు వ్యాయామం చేశారు?

షారుక్‌: 6 నెలలు పట్టింది ఆ లుక్‌ రావడానికి. 

మీ మొదటి ప్రేయసి ఎవరు?

షారుక్‌: నా భార్య గౌరి. తనే నా మొదటి ప్రేయసి. 

సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

షారుక్‌: మీ రహస్యాలను, లోపాలను ఎవ్వరితో పంచుకోకండి. అప్పుడు సంతోషంగా ఉంటారు.

‘పఠాన్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఎలా అనిపించింది?

షారుక్‌: ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. వాళ్లు ఇప్పటికీ పగలు..రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. వాళ్లందరితో షూటింగ్‌ సమయంలో ఎంజాయ్‌ చేశాను.

సిద్ధార్థ ఆనంద్‌ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?

షారుక్‌: చాలా బాగుంది. షూటింగ్‌ సమయమంతా సరదాగా గడిచింది.

2024లో ఎన్ని సినిమాల్లో చూడొచ్చు మిమ్మల్ని?

షారుక్‌: దీనికి సమాధానం మరికొన్ని రోజుల్లో చెబుతాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని