Shriya: ఆ సినిమా వల్ల భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నా..: శ్రియ

ఎన్నో సినిమాలతో అలరిస్తున్న శ్రియ(Shriya) తన జీవితంలో ‘నువ్వే నువ్వే’ సినిమా ఎంత ప్రత్యేకమైనతో పంచుకుంది. అలాగే అగ్రహీరోల నుంచి ఆమె ఏం నేర్చుకుందో తెలిపింది. 

Published : 15 Dec 2022 02:19 IST

హైదరాబాద్‌: తన అందంతో పాటు చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రియ(Shriya). ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ తర్వాత అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తరచూ తన జీవితంలో జరిగే విశేషాలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ అందాలతార. తరుణ్‌ సరసన శ్రియ నటించిన నువ్వే నువ్వే(Nuvve Nuvve) సినిమా తన కెరీర్‌లోనే బిగ్గిస్ట్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా తన జీవితంలో ఎంతగా మార్పు తెచ్చిందో చెప్పింది.

‘‘నువ్వే నువ్వే సినిమా తండ్రికూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని అద్భుతంగా చూపింది. ఆ సినిమా వల్ల నేను నా భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకున్నాను’’ అని చెప్పింది. ఇక తాను నటించిన అగ్ర హీరోల గురించి మాట్లాడిన శ్రియ.. ‘చిరంజీవి గారి డాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇక రజనీకాంత్‌ గారిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. ఆయన చాలా తెలివైన వారు. అందరితో ఎలా కలిసిపోవాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను’ అని తెలిపింది.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ గొప్ప చిత్రం. రాజమౌళిగారి పనితీరు అద్భుతం. చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకోవాలి. ఎందుకంటే ఇది అన్నిటికీ అర్హమైనదని నేను భావిస్తున్నాను’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు