Sirivennela: పాటల రచయిత కాకపోయుంటే..? అదే నా ప్రేరణ: సిరివెన్నెల
తన తొలి సినిమా ‘సిరివెన్నెల’నే తన ఇంటిపేరుగా పేరుగా సుస్థిరం చేసుకున్నారు సీతారామశాస్త్రి. మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన తెలుగు సినీ పాటకు ఓ తేనె పూత. ఆబాల గోపాలాన్ని అలరించే వేలాది పాటలు రాసి.. తెలుగు పాట సాహిత్య కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన .....
ఇంటర్నెట్ డెస్క్: తన తొలి సినిమా ‘సిరివెన్నెల’నే ఇంటిపేరుగా పేరుగా సుస్థిరం చేసుకున్నారు లెజండరీ రచయిత సీతారామశాస్త్రి. మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన తెలుగు సినీ పాటకు ఓ తేనె పూత. ఆబాల గోపాలాన్ని అలరించే వేలాది పాటలు రాసి.. తెలుగు పాట సాహిత్య కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన సిరివెన్నెల ఇకలేరన్న నిజాన్ని తెలుగు సినీ, సాహితీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు భాషకు పట్టం కడుతూనే తన పాటల్లో నవరస భావోద్వేగాలను పలికించే పాటల మాంత్రికుడాయన. ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఆస్క్ సిరివెన్నెల’ పేరుతో జూన్‌లో సినీ ప్రియులతో చిట్‌చాట్‌లో ఆయన తన గురించి.. తన సాహిత్యం తదితర అనేక అంశాలపై సూటిగా పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
అప్పట్లో ఉన్న పాటలు సినిమాలూ ఇప్పుడెందుకు రావడంలేదు?
* ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం.
త్రివిక్రమ్ మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం?
* మనకు ఇష్టమైన విషయాన్ని మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను.. కాబట్టి దాన్ని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.
లైఫ్ ఆఫ్ రామ్ పాట ఒక అద్భుతం. ఆ పాటలో మీకు నచ్చిన లైను గురించి చెప్పండి?
* ‘‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా// ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’’.. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్ర బిందువు
మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని ఎక్కువగా శ్రమపెట్టిన పాట ఏది?
* పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటులేదు
మీకు నచ్చిన సినిమా, మీ దృష్టిలో సినిమా అంటే?
* లిస్టు చాలా పెద్దది, ‘పిట్టభాష’ సరిపోదు. ఇక - కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.
మీకు బాగా నచ్చిన కవి ఎవరు?
* వాల్మీకి
ఇన్నేళ్ల మీ సాహిత్య ప్రస్థానంలో మీరు ప్రయోగించిన, మీరు గర్వించదగిన పదం లేదా వాక్యం?
* ‘‘ప్రశ్న- కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటాడే ప్రశ్న’’
దైవాన్ని నిర్వచించాలంటే?
.. తనను తాను నిర్వచించుకోగలగాలి
మీ పాటల్లో మీరు గర్వించే పాట?
* ప్రతీ పాట
మీరు రాసిన పాటల్లో వేటూరి సుందరామ్మూర్తి గారికి ఏ పాట ఇష్టం? ఆయన మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం?
* చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.
మీరు ఎక్కువ సమయం ఏం చేస్తుంటారు?
* ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను.
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా?
* మనల్ని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!
మీరు ప్రజలకు చదవమని చెప్పే ఐదు పుస్తకాలు ఏమిటి?
* నేను ప్రజలకు ఫలానా పుస్తకం చదవమని ఎప్పుడూ చెప్పలేదు. అది జీవితాన్ని తీవ్రమైన అక్కరతో బతకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏది చదవాలో, ఎప్పుడు ఏది కావాలో జీవితమే తెచ్చి ఇస్తుంది.
‘ఊరికే పేజీలు తిరగేసే బ్రెయిన్ లైబ్రరీలో బీరువాలాంటిది’
నిరంతరాయంగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి ఏంటి?
* అత్యంత తీవ్రతతో ఉన్న క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం.. అదే నా ప్రేరణ.
ఏకాగ్రతకు మీ నిర్వచనం?
* నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం.నేను తప్ప ఇంకే అనిపించకపోవడం.
మీరు మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్?
* ఒక వ్యక్తి ఉండరు, వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గొప్పగానే చేస్తారు. ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాదు.. ఏ ప్రతిభా వ్యక్తీకరణకైనా ఇదే వర్తిస్తుంది.
చెంచాడు భవసాగరాన్ని ఈదడానికి ఆవశ్యమైన సాధనాలేంటి ?
* ఆ మాట అన్నది అమృతం సీరియల్ రూపకర్త గుణ్ణం గంగరాజు. మీ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే - ‘భవసాగరాన్ని ఒక చెంచాడే అనుకోగలగడం’
రచయితకు ఉండాల్సిన మొదటి లక్షణం?
* తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం.
దేవులపల్లి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత?
* ‘‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా "తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు" - వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది.
మీరు రచించని పాటల్లో మీరు ఎంతగానో మెచ్చిన పాట ఏది?
చాలా! ప్రతీ ఒక్కరూ ఏదోఒక గొప్ప పాట రాసే ఉంటారు.
మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతారు?
* నేనున్నాను గనుక!
మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన రెండు పాటలు?
* "నా పాట పంచామృతం.. నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగ"
"సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని"
లిరిక్స్ రాయడానికి ఏదైనా ఫేవరేట్ స్థలం మీకు ఉంటుందా?
* నా బుర్రలో అలజడి!
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం? నిజమా?
* తప్పే! మృగాలను అవమానించకూడదు
ప్రేమ పాటల్ని అద్భుతంగా రాసే మీకు కావాల్సిన ప్రేరణ, స్ఫూర్తి ఎవరిని నుంచి కలుగుతుంది?
* బతుకంతా ప్రేమే! ప్రేమ నుంచే ప్రేమ వస్తుంది!
పాటలో నిరాశానిస్పృహల్ని వ్యక్తపరిచే సందర్భంలో కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
* కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం.
‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా// ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా’’
యూత్‌కి ఇచ్చే సందేశం?
* యూత్ అనేది ఏజ్ కాదు.. అదొక ఫేజ్. అదొక స్టేజ్. అది తెలుసుకుంటే యూత్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ మెసేజ్.
మీరు పాటల రచయిత కాకపోయి ఉంటే?
* జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.
తెలుగుభాష గొప్పతనం ఏంటి?
* ఏ భాష ప్రత్యేకత ఆ భాషదే. అసలు సమస్య ఏమిటంటే.. మనుషులందరినీ కలపాల్సిన భాష... ‘లు’ తగిలించుకొని ఇన్నిగా ఎందుకుండాలి?
మీకు బాగా నచ్చిన పుస్తకాలు?
* నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండోది ఖలీల్ జిబ్రాన్ రాసిన ద ప్రాఫెట్.
కాళీపట్నం రామారావు (కా.రా.) మాస్టారు గురించి..
*కథా యజ్ఞానికి ప్రధాన రుత్విజుడు కాళీపట్నం రామారావు మాస్టారు. జీవితం అంతటినీ కథ అనే సాహితీ ప్రక్రియకు అంకితం చేసిన మహా వ్యక్తి. కథని పదికాలాల పాటు పచ్చగా ఉంచడానికి పెంచడానికి తన యాగఫలాన్ని ధారపోసి వెళ్లారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్ అని సంబోధిస్తుంటారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్‌లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం