Amazon Prime: మీరు క్రీడా ప్రేమికులా? అయితే, ఈ ఆరు చిత్రాలు మీకోసమే!

Amazon Prime: అమెజాన్‌ ప్రైమ్‌లో అలరిస్తున్న ఆరు స్పోర్ట్స్‌ డ్రామా మూవీలు ఇవే!

Updated : 30 Aug 2022 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర వాటితో పోలిస్తే, స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. భావోద్వేగాల మిళితంగా సాగే ఈ చిత్రాలు ఆద్యంతం అలరిస్తాయి. ఇక ఆఖరి పోరు ఎపిసోడ్‌ వెండితెరపై చూస్తుంటే కొందరికి కన్నీళ్లు కూడా ఆగవు. కేవలం వినోదాన్ని పంచడమే కాదు, స్ఫూర్తిని కూడా నింపుతాయి స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాలు. అలాంటి ఆరు చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అలరిస్తున్నాయి. ‘సైనా’, ‘సార్‌పట్ట’, ‘చక్‌ దే ఇండియా’, ‘సుల్తాన్’, ‘తూఫాన్‌’, ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్’ చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలను అమెజాన్‌ ప్రైమ్‌ యూట్యూబ్‌లో పంచుకుంది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని