సోనూ గొప్ప మనసు.. పిల్లల కోసం టవర్‌ ఏర్పాటు

ఇంటర్నెట్‌ లేదన్న కారణంతో ఓ గ్రామంలో పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తెలుసుకున్న సోనూసూద్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే ఆ గ్రామంలో సెల్‌టవర్‌ ఏర్పాటు చేయించారు.

Published : 11 Apr 2021 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్నెట్‌ లేదన్న కారణంతో ఓ గ్రామంలో పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తెలుసుకున్న సోనూసూద్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే ఆ గ్రామంలో సెల్‌టవర్‌ ఏర్పాటు చేయించారు. పిల్లలకు సరైన చదువు అందించలేకపోతే మనం చుదువుకున్న చదువుల వల్ల ఉపయోగం ఏమిటంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. మీ గ్రామానికి ఎప్పుడైనా వస్తే.. దయచేసి నాకు కూడా వైఫై పాస్‌వర్డ్‌ చెప్పండి అంటూ ఆయన ఆ ట్వీట్‌లో సరదాగా రాసుకొచ్చారు.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు సమీపంలోని గొడియా జిల్లాలోని ఓ గ్రామంలో మున్న బిరన్వార్‌, అన్మోల్‌ బిరన్వార్‌ అనే ఇద్దరు యువకులు విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించేందుకు ముందుకు వచ్చారు. అయితే.. ఆ గ్రామంలో ఇంటర్నెట్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు ఇబ్బందిగా మారింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఆ ఇద్దరు యువకులు సోనూసూద్‌కు ట్విటర్‌లో సమస్యను వివరించారు. స్పందించిన సోనూసూద్‌.. ఆ గ్రామంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇండస్‌ టవర్స్‌తో మాట్లాడిన సోనూ.. గంటల వ్యవధిలోనే సెల్‌ టవర్‌ ఏర్పాటు పూర్తి చేయించారు. ఆ తర్వాత వీడియో కాల్‌ ద్వారా ఆ గ్రామస్థులతో సోనూ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని