Jeevitha: వాళ్ల కెరీర్ కోసమే మాట్లాడడం తగ్గించేశా: నటి జీవిత

నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని నటి జీవిత అన్నారు.

Updated : 05 Mar 2024 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి విషయంలోనైనా తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతారు నటి జీవిత (Jeevitha). అలా నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు వివాదాలను ఎదుర్కొవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఉన్నది ఉన్నట్లు చెప్పడం కూడా సరైన పద్ధతికాదని.. అలా చెప్పడం కొందరికి నచ్చదని అర్థమైంది. మనం స్పందించకపోతే ప్రపంచం ఆగిపోదుకదా అనుకున్నా.. అందుకే మాట్లాడడం తగ్గించేశా. అన్నీ అంశాలపై మాట్లాడకపోవడం వల్ల నేను, రాజశేఖర్‌ ఏమీ నష్టపోలేదు. హాయిగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మేమంటే నచ్చని వాళ్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు. వాళ్ల కెరీర్‌ ఎఫెక్ట్‌ కాకూడదు. మా కారణంగా వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించాం. ఇప్పుడు మౌనంగా ఉంటున్నామంటే అది భయం వల్ల కాదు. నేను ఏ విషయంలోనూ భయపడను’ అని చెప్పారు. 

మిస్‌ ఇండియా చిందేస్తే.. పొట్లాం కట్టిన బిర్యానీలా పూజా.. నెరవేరిన రష్మిక కల..

‘‘మాతృదేవోభవ’ సినిమా ప్రధానపాత్ర కోసం నన్ను ఆ చిత్రబృందం సంప్రదించింది. రాజశేఖర్‌ కూడా ఓకే చెప్పమన్నారు. నేను అంగీకరించలేదు. దీంతో ఆ పాత్ర మాధవి చేసింది. పెళ్లి తర్వాత మంచి గృహిణిగా ఉండాలని నటనకు దూరంగా ఉండాలనుకున్నా. అందుకే ఆ సినిమా వదులుకున్నా. అలా చేసినందుకు నేనేం బాధపడలేదు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో కనిపించా. నా జీవితంలో అన్నిటికంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. నా భర్త, పిల్లలే నా ప్రపంచం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని