Updated : 20 May 2022 06:52 IST

NTR 30: రావాల్సిన సమయం వచ్చింది

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఇటీవలే పలకరించారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎన్టీఆర్‌30’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం దీనికి సంబంధించిన ప్రచార చిత్రం విడుదల చేశారు.  ‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు.. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా..’’ అంటూ టీజర్‌లో తారక్‌ పలికిన శక్తిమంతమైన సంభాషణలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.  పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా.. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబూ సిరిల్‌, సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రాహణం: రత్నవేలు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని