Sreeleela: మీ జీవితంలో విలువైన ఆ మూడింటినీ వారికి ఇవ్వండి: శ్రీలీల
‘ధమాకా’ (Dhamaka) విజయం తర్వాత వరుస క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు నటి శ్రీలీల (Sree Leela). తాజాగా ఈ భామ తన గొప్ప మనసును చాటుకున్నారు.
హైదరాబాద్: యువ నటి శ్రీలీల (Sree Leela) తన మంచి మనసు చాటుకున్నారు. #Hereforyou అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీకెండ్‌లో భాగంగా శనివారం ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించిన ఆమె అక్కడి చిన్నారులతో విలువైన సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ వీలు కుదిరినప్పుడు ఇలాంటి చిన్నారులతో సమయాన్ని గడపాలని కోరారు.
‘‘గొప్ప కలలతో ఉన్న నా చిన్న సమూహం. గొప్ప మనసులతో ఉన్న నా చిన్నారులు. వాళ్లు ఎంత గొప్పవాళ్లో.. కలిసే వరకూ మీకూ తెలియదు. కలలు, కథలు, డ్యాన్స్, పాటలు, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం.. ఇలా ఈరోజు ఎంతో ఆనందంగా గడిపాను. వాళ్లందరికీ ప్రేమను పంచాలనే ఉద్దేశంతో అక్కడ అడుగుపెట్టాను. వాళ్ల అమాయకపు చూపులు, బోసి నవ్వుల్లో నేను తడిసి ముద్దయ్యాను. ఇలాంటి క్షణాలను అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడిది అందరికీ సాధ్యమవుతుంది!! ఇతరులకు సాయం చేయాలని చాలా మందికి ఎన్నోసందర్భాల్లో అనిపిస్తుంది. కాకపోతే, ఎలా చేయాలి? ఎవరికి సాయం చేయాలి? అనేదానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది.
గూగుల్‌లో సెర్చ్ చేసి మీచుట్టూ ఉన్న ఇలాంటి ఎంతోమంది చిన్నారులను మీరు కలుసుకోవచ్చు. ఈ పోస్ట్ పెట్టి.. భారీ విరాళాలు ఇవ్వమని నేను కోరుకోవడం లేదు. కానీ, మీ జీవితంలో ఎంతో విలువైన సమయం, ప్రేమ, ఆప్యాయతను ఇవ్వాలని కోరుతున్నా. వీటినే వాళ్లు కోరుకునేది. వారం లేదా నెలకు ఒక్కసారైన వాళ్లతో కలిసి భోజనం చేయండి. ఇది కేవలం కడుపు మాత్రమే నింపదు. ఆనందంతో హృదయం నిండిపోతుంది. అలాంటి మనసుతోనే #Hereforyouని మొదలుపెడుతున్నా. ఏదైనా అనాథాశ్రమాన్ని మీరు సందర్శిస్తే.. ఫొటోలు తీసుకుని #Hereforyou అనే ట్యాగ్‌ని జత చేస్తూ వాటిని షేర్ చేయండి’’ అని శ్రీలీల పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల మదిని గెలుచుకుంది. చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీలీలను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు