Sudheerbabu: ‘నన్నెవరూ ఆపలేరు’ : సుధీర్‌బాబు

నటుడు సుధీర్‌బాబు హీరోగా సిద్ధమైన సరికొత్త చిత్రం ‘హంట్‌’. మహేశ్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది

Published : 03 Oct 2022 12:25 IST

హైదరాబాద్‌: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా తర్వాత సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హంట్‌’ (HUNT). పోలీస్‌ కథతో సిద్ధమవుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మహేశ్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘‘అతను అర్జున్‌ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్‌ బీ. ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా ‘బీ’కి తెలియవు’’ అంటూ మంజుల చెప్పే సంభాషణలతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తిగా సాగింది. ‘‘తనెలా చనిపోయాడో తెలుసుకునే క్రమంలో ఎవరు ఎంత ఇబ్బందిపడినా నన్నెవరూ ఆపలేరు’’ అంటూ టీజర్‌ చివర్లో సుధీర్‌బాబు చెప్పే డైలాగ్‌లు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. అసలింతకీ ఈ అర్జున్‌ ‘ఏ’, ‘బీ’ ఎవరు? అర్జున్‌ పోరాటం ఎవరితో? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈసినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ భరత్‌ కీలకపాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని