ఇంటివాడైన యువహీరో సుమంత్‌ అశ్విన్‌

నిర్మాత ఎం.ఎస్‌.రాజు తనయుడు, యువకథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌ ఒక ఇంటివాడయ్యాడు. కొద్దిమంది బంధుమిత్రల సమక్షంలో మూడుముళ్ల బంధంతో అశ్విన్‌, దీపిక ఒక్కటయ్యారు. నగరశివారులోని తన ఫామ్‌హౌజ్‌లో జరిగిన

Published : 13 Feb 2021 18:29 IST

హైదరాబాద్‌: నిర్మాత ఎం.ఎస్‌.రాజు తనయుడు, యువకథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌ ఒక ఇంటివాడయ్యాడు. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో అశ్విన్‌, దీపిక ఒక్కటయ్యారు. నగరశివారులోని తన ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కొంతమంది సహచర నటులు మాత్రమే హాజరయ్యారు. ‘తూనీగ తూనీగ’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు సుమంత్‌ అశ్విన్‌. ఆ తర్వాత ‘లవర్స్‌’, ‘కేరింత’, ‘హ్యపీ వెడ్డింగ్‌’ వంటి సినిమాల్లో చేశాడు. ‘ప్రేమకథా చిత్రం -2’ సినిమా సుమంత్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన నటించిన ‘ఇది మా కథ’ మార్చి 19న విడుదల కానుంది.

ఇవీ చదవండి..

సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని