Suriya ET Review: రివ్యూ: ఈటి (ఎవరికీ తలవంచడు)
Suriya ET Review: సూర్య కీలక పాత్రలో నటించిన ఈటి ఎలా ఉందంటే?
చిత్రం: ఈటి; నటీనటులు: సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, వినయ్ రాజ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు; సంగీతం: డి.ఇమ్మాన్; ఎడిటింగ్: రుబెన్; సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు; నిర్మాత: మారన్; రచన, దర్శకత్వం: పాండిరాజ్; బ్యానర్: సన్ పిక్చర్స్; విడుదల: 10-03-2022
కొత్త రకమైన సినిమాలు.. ప్రయోగాలు చేసినా వాటి మధ్యలో అప్పుడప్పుడూ మాస్ కథలతోనూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. వాటిలో అభిమానుల్ని మెప్పించే కమర్షియల్ అంశాలతో పాటు... బలమైన సామాజికాంశాలు కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుంటారు. ‘ఆకాశమే నీ హద్దురా’ ‘జై భీమ్’లాంటి భిన్నమైన ప్రయత్నాల తర్వాత సూర్య(suriya) చేసిన మరొక మాస్ చిత్రమే ‘ఈటి’(ET). కరోనాతో ఇదివరకు చేసిన రెండు సినిమాలూ ఓటీటీ వేదికల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విడుదలైన సూర్య చిత్రమిది. మరి ఎలా ఉందో, ఇందులో స్పృశించిన సామాజికాంశాలు ఏంటి?(ET Review)
కథేంటంటే: దక్షిణపురానికి చెందిన కృష్ణమోహన్ (సూర్య) ఓ లాయర్. చిన్నప్పుడే తన చెల్లిని పోగొట్టుకుంటాడు. అప్పట్నుంచి అన్నా అని ఏ ఆడపిల్ల సాయం అడిగినా కాదనడు. పక్కనే ఉన్న ఉత్తరపురంలో తన ఊరు దక్షిణపురానికి చెందిన ఎంతో మంది ఆడపడుచులు ఉంటారు. అత్తారింటికని వెళ్లిన తన ఊరి అమ్మాయిలంతా కామేశ్ (వినయ్ రాయ్) వల్ల ఇబ్బందుల్లో పడతారు. తనకున్న పలుకుబడితో ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుంటాడు కామేశ్. ఆ దుర్మార్గుడి ఆట కట్టించడం కోసం ఒక న్యాయవాదిగా కృష్ణమోహన్ ఏం చేశాడు?తన వృత్తితో సంబంధం లేకుండా వేటగాడిగా మారి ఏం చేశాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: చాలా రోజుల తర్వాత తన సినిమా థియేటర్లలో విడుదలవుతోంది కాబట్టి... థియేటర్‌కి వచ్చే అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాల్ని ఇష్టపడతారో దృష్టిలో ఉంచుకునే ‘ఈటి’ చేశాడు సూర్య. నిజ జీవితంలో తరచూ చోటు చేసుకునే సంఘటనల స్ఫూర్తితోనే ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు పాండిరాజ్. యువతుల భయాల్ని ఆసరాగా చేసుకుని వాళ్ల జీవితాల్ని ఎలా నాశనం చేస్తున్నారనే విషయాన్ని ఇందులో ఆలోచన రేకెత్తించేలా చూపించారు. మహిళల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపే అంశాలు ఇందులో ఉన్నాయి. ఉత్తరపురం, దక్షిణపురం మధ్య సంబంధం నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆరంభ సన్నివేశాలు సాధారణంగానే అనిపించినా, అధీరా (ప్రియాంక మోహన్)తో కృష్ణమోహన్ ప్రేమలో పడినప్పట్నుంచి కథ వేగం అందుకుంటుంది. ఒకవైపు ఊరిలో ఉత్సవ నిర్వహణ, మరోవైపు ఆ ఉత్సవంలోనే తాను ఇష్టపడిన అమ్మాయి అధీరాని తీసుకెళతానని కథానాయకుడు శపథం చేయడం కథని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఆపరేషన్ బేబీ పేరుతో సాగే ఆ ఘట్టాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి.(ET Review)
ద్వితీయార్ధం కామేశ్కీ, కృష్ణమోహన్‌కీ మధ్య పోరాటంతో సాగుతుంది. కథ, కథనాల్లో కొత్తదనమేమీ లేదు. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతాయి. మధ్య మధ్యలో హాస్య సన్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా, నవ్విస్తాయి. కథ, కథనాల మాటెలా ఉన్నా... సాంకేతికతని అడ్డు పెట్టుకుని కొద్దిమంది దుర్మార్గులు అమాయకులైన అమ్మాయిలపై బెదిరింపులకి పాల్పడినప్పుడు, లొంగదీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వాళ్లు ఎలా మసలుకోవాలి? అమ్మాయికి అందం అంటే ధైర్యమే అనే విషయాల్ని ఈ కథతో చెప్పిన తీరు మెప్పిస్తుంది.(ET Review) ద్వితీయార్ధంలో సందేశం చిత్రానికి ప్రధానబలం.
ఎవరెలా చేశారంటే: సూర్య(suriya) వృత్తి రీత్యా లాయర్ అయినా... పక్కా మాస్ అవతారంలో కనిపించాడు. సింహ భాగం సన్నివేశాల్లో లుంగీతో పల్లెటూరి యువకుడిగానే కనిపించాడు. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నమే అది. ఆయనకి అలవాటైన పాత్రే ఇది. పోరాట ఘట్టాల్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన అభినయం మరింతగా మెప్పిస్తుంది. కథానాయిక ప్రియాంక మోహన్ ప్రాధాన్యమైన పాత్రలోనే కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఆమెకి అనూహ్యంగా ఎదురయ్యే సంఘటన, ఆ తర్వాత ఆమె ధైర్యంగా నిలబడే తీరు మహిళల్లో స్ఫూర్తిని నింపుతుంది. (ET Review) అప్పటిదాకా అందంగా కనిపించిన ఆమె, ఆ సన్నివేశాల్లో చక్కటి అభినయం కూడా ప్రదర్శించింది. పల్లెటూళ్లో ఉంటూనే కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నట్టుగా కనిపిస్తూ విలనిజం పండించాడు వినయ్ రాయ్. ఆ పాత్ర క్రూరంగా పరిచయమైనా... ఆ తర్వాత కథపై పెద్దగా ప్రభావం చూపించకుండానే ముగుస్తుంది. సత్యరాజ్, శరణ్య, దేవదర్శిని, సూరి తదితరులు కామెడీ పంచారు. సాంకేతిక విభాగాల్లో రత్నవేలు కెమెరా పనితనం మెప్పిస్తుంది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు పాండిరాజ్ తన స్టైల్‌కి భిన్నంగా పక్కా కమర్షియల్ సూత్రాలతో ఈసినిమాని రూపొందించారు. కథనం పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సింది.
బలాలు
+ కథలోని సామాజికాంశాలు
+ సూర్య నటన
+ వినోదం, పతాక సన్నివేశాలు
బలహీనతలు
- ఊహకు తగ్గట్టుగా సాగే సన్నివేశాలు
- కొత్తదనం లేని కథ, కథనాలు
చివరిగా: మాస్ ఈటి... సూర్య అభిమానులకి..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
తాజా వార్తలు (Latest News)
-
లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..