Suriya: ‘శివ పుత్రుడు’ కాంబో రద్దు.. బాల చిత్రం నుంచి వైదొలిగిన సూర్య

బాల తెరకెక్కిస్తున్న ‘అచలుడు’ చిత్రం నుంచి హీరో సూర్య వైదొలిగారు. 

Published : 05 Dec 2022 01:33 IST

చెన్నై: ‘శివ పుత్రుడు’ సినిమాతో హిట్‌ కాంబినేషన్‌గా నిలిచారు దర్శకుడు బాల (Bala), నటుడు సూర్య (Suriya). కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించారు. అలాంటి వీరిద్దరూ కలిసి ఇటీవల ‘వనన్‌గాన్‌’ (అచలుడు) (Vanangaan) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో చిత్రం వస్తుందని తెలియడంతో సినీ అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ, తాజా ప్రకటనతో నిరాశ చెందుతున్నారు. ఈ సినిమా నుంచి సూర్య వైదొలిగినట్టు బాల వెల్లడించడంతో సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.  భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కన్యాకుమారిలో షూట్‌ చేశారు. టైటిల్‌ పోస్టర్‌, సూర్య లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకి సూర్య, ఆయన సతీమణి, నటి జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. కృతిశెట్టి కథానాయికగా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని