Suriya: అలాంటి వ్యాఖ్యల గురించి ఆలోచించి రోజంతా వృథా చేసుకోవద్దు: హీరో సూర్య

నటులు సూర్య, కార్తి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Published : 17 Jul 2023 15:50 IST

చెన్నై: తమిళ హీరోలు సూర్య (Suriya), కార్తి (Karthi)లు తెలుగు ఇండస్ట్రీలోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా చెన్నైలో ఓ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ఓకే వేదికపై మెరిశారు. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ తమిళ హీరో విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే నెగెటివిటీ గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూర్య సూచించారు.

ఇటీవల విజయ్ తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వాళ్లకు సర్టిఫికేట్స్‌, నగదు ప్రోత్సాహం అందించి అభినందించారు. ఈ విషయం గురించి మాట్లాడిన కార్తి అతడిపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు విజయ్‌ చేస్తున్న కృషి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని కార్తి అన్నారు. ఇలాంటి మంచి పనులు చేయడానికి విజయ్‌ ముందుకు రావడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇక అదే కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘సమాజంలో నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల వ్యాఖ్యలను పట్టించుకుంటే ముందుకు సాగలేం. పది సెకన్లు మన గురించి నెగెటివ్‌గా మాట్లాడితే దాని గురించి ఆలోచిస్తూ రోజంతా వృథా చేసుకోకూడదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి.

మొదటి సారి ప్రియుడి ఫొటోలు షేర్‌ చేసిన ఇలియానా

ఇక సినిమాల విషయానికొస్తే సూర్య తన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’తో (Kanguva) బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.  మృణాల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషిస్తోన్న ఈ మూవీ తొలి గ్లింప్స్‌ జులై 22న విడుదల కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు సందడి చేస్తున్నాయి. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక కార్తి ‘జపాన్‌’ (Japan) సినిమాలో నటిస్తున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని