Tamannaah: ‘నా తల్లిదండ్రులే నన్నిలా ప్రశ్నించలేదు’: ఫ్యాన్‌ ప్రశ్నపై తమన్నా అసహనం

ఫ్యాన్స్‌ మీట్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తమన్నా (Tamannaah) అసహనానికి గురయ్యారు.

Published : 06 Sep 2023 13:56 IST

చెన్నై: ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తున్నారు నటి తమన్నా (Tamannaah). ఇటీవల ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అయితే..పెళ్లి గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె అసహనానికి గురయ్యారు.

చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్‌ మీట్‌లో తమన్నా ఇటీవల పాల్గొన్నారు. ‘‘నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు?’’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘‘వ్యతిరేకత, విమర్శలు వచ్చినప్పుడు.. ఎందుకిలా జరుగుతుందని ఆలోచిస్తాం. కొంతమంది ప్రశంసిస్తారు.. మరికొంత మంది విమర్శలు చేస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి చింతించాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతను నేను ఎక్కువగా పట్టించుకోను’’ అని ఆమె చెప్పారు.

మహేశ్.. నీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నా: షారుఖ్‌

అనంతరం మరో నెటిజన్‌.. ‘‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? తమిళనాడుకు చెందిన అబ్బాయిలు మీకు నచ్చలేదా?’’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు తమన్నా ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘‘నా తల్లిదండ్రులే ఇలా నన్నెప్పుడూ అడగలేదు’’ అని అన్నారు. తన ప్రియుడు విజయ్‌ వర్మను ఉద్దేశిస్తూ.. ‘‘ప్రస్తుతం జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. నా లైఫ్‌ ఎంతో ఆనందంగా సాగుతుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని