Tamannah: శ్రుతి నాకు స్ఫూర్తి

  కొంచెం నిరూత్సాహం ఆవ‌రిస్తే చాలు వెంట‌నే శ్రుతి హాస‌న్‌ని ఫోన్ చేసి మాట్లాడ‌తాను, త‌నే నాకు స్ఫూర్తి అని త‌మ‌న్నా భాటియా అన్నారు.  ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే.

Published : 08 Jun 2021 12:28 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘కొంచెం నిరూత్సాహం ఆవ‌రిస్తే చాలు వెంట‌నే శ్రుతి హాస‌న్‌ని ఫోన్ చేసి మాట్లాడ‌తాను, త‌నే నాకు స్ఫూర్తి’ అని త‌మ‌న్నా భాటియా అన్నారు. ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. ఖాళీ ఉన్న‌ప్పుడ‌ల్లా ఒక‌రింటికి ఒకరు వెళ్తుంటారు. ఇప్ప‌టికే పలు ఇంట‌ర్వ్యూల్లో శ్రుతి గురించి త‌మ‌న్నా, త‌మ‌న్నా గురించి శ్రుతి త‌మ అనుబంధాన్ని తెలియ‌జేశారు. తాజాగా మ‌రోసారి శ్రుతి అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో చెప్పుకొచ్చింది త‌మన్నా.

‘‘ఎప్పుడైనా మ‌న‌సు బాగోలేక‌పోతే శ్రుతి హాస‌న్‌కి ఫోన్ చేసి, త‌ను అంత ఉత్సాహంగా ఎలా ఉంటుందో అడుగుతాను. శ్రుతి త‌న ఇంటిని తనే చక్క‌గా తీర్చిదిద్దుకుంటుంది. ఒక్క‌తే అలా చేయ‌డం మామూలు విష‌యం కాదు. పైగా కెరీర్ ప‌రంగా ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతుంది. సామాజిక మాధ్య‌మాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానుల‌తో స‌ర‌దాగా మాట్లాడుతుంది. ఇలా ఎప్పుడూ హుషారుగా ఉండ‌టం చాలా క‌ష్టం. ఈ విష‌యంలో శ్రుతి నాకు స్ఫూర్తి’’ అని పేర్కొంది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం ‘గుర్తుందా శీతాకాలం’, ‘ఎఫ్ 3’, ‘సీటీమార్‌’, ‘అందాధూన్’ చిత్రాల్లో న‌టిస్తోంది త‌మ‌న్నా. క్రాక్, వ‌కీల్ సాబ్ చిత్రాల‌తో ఇటీవ‌ల సంద‌డి చేసింది శ్రుతి హాస‌న్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని