Veera Shankar: తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్‌ ఎన్నికయ్యారు. 

Published : 11 Feb 2024 18:55 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్‌ (Veera Shankar) ప్యానల్‌ విజేతగా నిలిచింది. సంఘం ప్రెసిడెంట్‌గా వీర శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌లుగా వశిష్ఠ, సాయి రాజేశ్‌ (Telugu Film Directors Association President) ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్స్‌ జరిగాయి. అనంతరం, ఫలితాలు వెలువడ్డాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉన్నారని సమాచారం. తాజా ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. వీర శంకర్‌కు 536, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగుతుంది. వీర శంకర్‌ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు.

‘హలో: ఐ లవ్‌ యూ’, ‘ప్రేమ కోసం’, ‘విజయరామరాజు’, ‘గుడుంబా శంకర్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు వీర శంకర్‌. ‘జాతి రత్నాలు’, ‘విరాటపర్వం’ వంటి సినిమాల్లో నటించారు. ‘బింబిసార’తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ప్రస్తుతం.. చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘బేబీ’తో ఘన విజయం అందుకున్నారు సాయి రాజేశ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని