Samantha: తినటం కోసమే సమంత వర్కౌట్‌.. ఆమెకు ఇష్టమైన స్నాక్‌ ఇదే!

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నటుల్లో సమంత ఒకరు.  సినిమాల చిత్రీకరణలతో ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంటారు.

Published : 31 Dec 2021 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నటుల్లో సమంత ఒకరు. సినిమాల చిత్రీకరణలతో ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంటారు. సరదా పోస్ట్‌లు పెడుతూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే వ్యాయామానికి సంబంధించిన పోస్ట్‌ పెట్టి నవ్వించారు. తాను జిమ్‌ (వెయిట్‌ లిఫ్టింగ్‌) చేసిన వీడియోను షేర్‌ చేస్తూ ‘తినేందుకుకే ఈ వర్కౌట్‌’ అని రాసుకొచ్చారు. ఏం తినేందుకు ఆ కసరత్తులు చేశారో మరో పోస్ట్‌ ద్వారా తెలియజేశారు. ఇంతకీ, సమంత తినాలనుకున్నది ఏ పంచభక్ష పరమాన్నాలో, బిర్యానీయో కాదు.. సమోస! 

మరోవైపు తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ శిల్ప, వాసుకితో కలిసి సమంత ఇటీవల గోవా టూర్‌ వెళ్లారు. అక్కడి దృశ్యాల్నీ అభిమానులతో పంచుకున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో విశేషంగా అలరించిన సమంత 2022లో పలు క్రేజీ ప్రాజెక్టులతో వినోదాన్ని పంచనున్నారు. ‘శాకుంతలం’, ‘యశోద’ వంటి పాన్‌ ఇండియా సినిమాలతోపాటు ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ కనిపించనున్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని