Bandla Ganesh: చిరు సర్‌.. బాగా చెప్పారు: బండ్ల గణేశ్‌

తెలుగు చిత్ర పరిశ్రమకు తాను పెద్దగా వ్యవహరించాలనుకోవడం లేదంటూ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా వైరల్‌గా మారాయి. తెలుగు సినీ కార్మికులకు హెల్త్‌ కార్డులు పంపిణీ నిమిత్తం చిరంజీవి ఛారిటబుల్‌...

Updated : 02 Jan 2022 14:01 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు తాను పెద్దగా వ్యవహరించాలనుకోవడం లేదంటూ అగ్రకథానాయకుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినీ కార్మికులకు హెల్త్‌ కార్డులు పంపిణీ నిమిత్తం చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా చిరు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పెద్ద దిక్కు హోదాని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం లేదని.. ఆ హోదా తనకస్సలు వద్దని.. బాధ్యత కలిగిన పరిశ్రమ బిడ్డగా అవసరమైన సమయంలో ముందుంటానని అన్నారు.

‘మా’ ఎన్నికల అనంతరం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై నిర్మాత బండ్లగణేశ్‌ స్పందించారు. చిరు వ్యాఖ్యలను సమర్థించారు. ఈ మేరకు చిరు వ్యాఖ్యలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన గణేశ్‌.. ‘‘సూపర్‌ సర్‌.. బాగా చెప్పారు’’ అని అన్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని