Bangarraju: ఓటీటీలోకి ‘బంగార్రాజు’.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

టాలీవుడ్‌కి సంబంధించి 2022 సంక్రాంతి సీజన్‌ ఎన్నడూలేని విధంగా ఆసక్తిని పెంచుతోంది.

Updated : 04 Jan 2022 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌కి సంబంధించి 2022 సంక్రాంతి సీజన్‌ ఎన్నడూలేని విధంగా ఆసక్తిని పెంచుతోంది. జనవరి 7న రావాల్సిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదాతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఈ భారీ చిత్రం వాయిదాపడటంతో ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాయి. కానీ, ‘ఇది పండగ సినిమా.. సంక్రాంతికే వస్తుంది’ అని ‘బంగార్రాజు’ చిత్ర బృందం ఎప్పటినుంచో చెప్తున్నా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘బంగార్రాజు’ ఓటీటీలో విడుదలవుతుందని కొందరు అంటుంటే, 14 రోజుల థియేటర్‌ ప్రదర్శన తర్వాత ఫలానా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందంటూ మరికొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. వీటిపై చిత్ర నిర్మాణ సంస్థ ‘జీ 5’ తాజాగా స్పందించింది. ‘బంగార్రాజు’ చిత్ర విడుదలపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అభిమానులు ఆశించినట్టుగానే ఈ సినిమాను కొవిడ్‌ నిబంధలను పాటిస్తూ థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన వినోదాత్మక చిత్రమిది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందించారు. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని