
Jabardasth: ‘జబర్దస్త్’ను వీడనున్న ‘సుడిగాలి సుధీర్’ టీమ్... నిజమేనా?
ఇంటర్నెట్ డెస్క్: సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్‌ను వీడిపోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్‌లో ఈ విషయమై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. తాము ‘జబర్దస్’ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ సుధీర్, శ్రీను, రామ్‌ప్రసాద్ స్టేజీ మీద చెప్పుకొచ్చారు. ‘‘మేం ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. కానీ, ఈ వేదికపై చెప్పాల్సి వస్తోంది. ఇకపై జబర్దస్త్ నుంచి మేం వెళ్లిపోవాలనుకుంటున్నాం!! మమ్మల్ని క్షమించండి. ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక స్కిట్ కోసం చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ‘సుధీర్ స్పెషల్ స్కిట్’ పేరుతో ఈ టీమ్ హంగామా చేసింది. రాకెట్ రాఘవ ఫ్యామిలీ, ఆదితో వీరు చేసిన అల్లరి వావ్ అనిపిస్తుంది. రాఘవ తనయుడు మురారీ... సుధీర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. పంచ్ మీద పంచ్ విసిరి కితకితలు పెట్టాడు. ఇలాంటి మరిన్ని నవ్వుల చమక్కులు చూసి ఎంజాయ్ చేయండి.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.