Seetimarr: ‘సీటిమార్‌’కి సిద్ధం కండి..!

ప్రేమ, కుటుంబకథా చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో గోపీచంద్‌ మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీటిమార్‌’....

Updated : 07 Dec 2022 20:35 IST

హైదరాబాద్‌: ప్రేమ, కుటుంబకథా చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో గోపీచంద్‌ మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీటిమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ‘గౌతమ్‌నంద’ తర్వాత సంపత్‌నంది-గోపీచంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి పాత్ర పోషించారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావురమేశ్‌, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని