Bigg boss telugu 5: బిగ్‌బాస్‌ హోటల్‌లో దొంగతనం..!

కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించేందుకు ఇంటిసభ్యులందరూ ఎంతో ప్రయత్నిస్తున్నారు. ‘బీబీ హోటల్‌’ టాస్క్‌లో భాగంగా మొదటిసారి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు వచ్చిన వ్యక్తిగా...

Published : 11 Nov 2021 14:50 IST

హైదరాబాద్‌: కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించేందుకు ఇంటిసభ్యులందరూ ఎంతో ప్రయత్నిస్తున్నారు. ‘బీబీ హోటల్‌’ టాస్క్‌లో భాగంగా తొలిసారి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వచ్చిన వ్యక్తిగా సన్నీ తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తున్నాడు. హనీమూన్‌ టూర్‌ కోసం హోటల్‌కు వచ్చిన మానస్‌-ప్రియాంకలను సన్నీ డిస్టర్బ్‌ చేస్తూ మేనేజర్‌ అనీమాస్టర్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ‘‘హీరోయిన్‌తో కలిసి హోటల్‌కి వచ్చిన హీరోలా ఆయన బిల్డప్‌ కొడుతున్నాడు’’ అంటూ మానస్‌-ప్రియాలపై సన్నీ చేసే కామెంట్లతో ఇంటి సభ్యులందరూ నవ్వుకున్నారు.

అనంతరం ఇంటి సభ్యులందరూ కలిసి డబ్బుల విషయంపై చర్చించుకున్నారు. ఇప్పటి వరకూ రూ.1700 బిల్లు అయ్యిందని మేనేజర్‌ అనీమాస్టర్‌, రవి.. హోటల్‌కు విచ్చేసిన అతిథులతో చెప్పడంతో.. ‘‘రూ.1700 లెక్కతేలే వరకూ మా నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాదు’’ అని కాజల్‌ సమాధానమిచ్చింది. దీనిపై స్పందించిన రవి.. ‘‘ఇప్పుడు మీరు కనుక డబ్బులు ఇవ్వను అంటే.. మేము కూడా సర్వీసులు ఆపేస్తాం’’ అని గట్టిగా సమాధానమిచ్చాడు. అనంతరం కాజల్‌, మానస్‌, సిరి.. హోటల్‌ నుంచి ఆహారం దొంగతనం చేశారు. ‘‘హోటల్‌కి వచ్చి.. హోటల్‌ నుంచే దొంగతనం చేస్తున్నాం.. మళ్లీ మనం రిచ్‌’’ అన్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని