
Jabardasth: స్టార్ కమెడియన్‌పై పంచుల వర్షం కురిపించిన బుడతడు
నవ్వులు పూయిస్తోన్న ‘జబర్దస్త్’ ప్రోమో..!
హైదరాబాద్: ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ కామెడీ షోలతో బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు హైపర్ ఆది. కరెంట్ టాపిక్, ట్రెండింగ్ సబెక్ట్‌లపై అలవోకగా పంచులు క్రియేట్ చేసి అందరి మెప్పు పొందిన ఆదిపై తాజాగా ఓ బుడతడు పంచుల వర్షంతో నవ్వులు పూయించారు. ఆ పంచుల ప్రవాహాలకు ‘జబర్దస్త్’ స్టేజ్ వేదికైంది. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయ నిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్’. ప్రతి గురువారం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన లేటస్ట్ ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.
హైపర్‌ఆది-రైజింగ్ రాజు స్కిట్‌లో భాగంగా రాకెట్ రాఘవ, వాళ్ల అబ్బాయి మురారి స్టేజ్‌పై సందడి చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లాడి గెటప్‌లో కనిపించిన మురారి.. తన తోటి విద్యార్థులైన ఆది, రాజుపై పంచుల వర్షం కురిపించారు. ‘అప్పట్లో నాకు అపరిచితుడంత జుట్టు ఉండేది. ఇప్పుడేమో మా అమ్మ పీకి పీకి హైపర్ ఆది జుట్టు అంత చేసింది’ అంటూ మురారి వేసిన పంచ్‌కి అనసూయ, రోజా, మనో నవ్వులు పూయించారు. అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన రాఘవ.. ‘నేను ఒక డాన్’ అని చెప్పి కొంచెం గట్టిగా నవ్వగా..‘జడ్జిలు నవ్వాలి కానీ.. నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?’ అంటూ మురారి అందర్నీ నవ్వించారు. అది మాత్రమే కాకుండా చలాకీ చంటి, వెంకీ మంకీస్, రాకెట్ రాఘవల ఫన్నీ స్కిట్‌లతో వచ్చే వారం ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. దీనికి సంబంధించి పూర్తి ఎపిసోడ్ చూడాలనుకుంటే వచ్చేవారం వరకూ వేచి చూడాల్సిందే..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.