Lovestory: ‘లవ్‌స్టోరీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. సరికొత్త ట్రైలర్‌ అదిరింది..!

‘లవ్‌స్టోరీ’తో చాలా రోజుల తర్వాత సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’

Published : 17 Oct 2021 12:08 IST

హైదరాబాద్‌: ‘లవ్‌స్టోరీ’తో చాలా రోజుల తర్వాత సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా గత నెలలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్‌ 22న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా అందుబాటులో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. మరోవైపు, ‘లవ్‌స్టోరీ’ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ.. ఆహా ఓ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. నటీనటులపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కి.. ఆన్‌స్క్రీన్‌పై మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిన ‘లవ్‌స్టోరీ’కి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడిలా నాగచైతన్య.. మౌనిక అనే పెద్దింటి అమ్మాయిగా సాయిపల్లవి నటించి మెప్పించారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని