MAA Elections: ‘మా’ ఎన్నికల పోలింగ్‌ సమయం పెంపు

‘మా’ ఎన్నికల పోలింగ్‌ గడువు పెంచారు. మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ ముగియాల్సి

Updated : 10 Oct 2021 14:39 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల పోలింగ్‌ గడువు పెంచారు. మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ ముగియాల్సి ఉన్నప్పటికీ ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానళ్ల అభ్యర్థన మేరకు మరో గంట పాటు పోలింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ తెలిపారు. ఓటు వేసేందుకు సభ్యులు ఇంకా వస్తున్నందున ప్యానళ్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

మరోవైపు మధ్యాహ్నం 1.30గంటల వరకు 56శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పటివరకూ 503 మంది ‘మా’ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్‌లో ఇంకా 100మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 474 ఓట్లు మాత్రమే పోలవగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగనుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని