Biggboss OTT: బిగ్‌బాస్ ఓటీటీ.. ఇక 24X7 ఎంటర్టైన్మెంట్ షురూ: నాగార్జున
బుల్లితెర వేదికగా తెలుగువారికి చేరువైన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఐదు సీజన్లగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగా 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యంతోపాటు...
త్వరలోనే కంటెస్టెంట్స్, గేమ్ రూల్స్ ప్రకటిస్తాం
హైదరాబాద్: బుల్లితెర వేదికగా తెలుగువారికి చేరువైన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఐదు సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగానూ 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం డిస్నీ హాట్‌స్టార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడారు.
‘‘బిగ్‌బాస్ షోని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కొవిడ్ సమయంలో తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. నాక్కూడా చక్కటి అనుభూతిని అందించింది. వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. ఎపిసోడ్స్ అన్నింటినీ చూడటం మొదలుపెట్టాను. సీజన్-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్‌లో ఎంతో సక్సెస్ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను. ఇక బిగ్‌బాస్-5 షో అప్పుడే అయిపోయిందా.. నమ్మలేకపోతున్నాం అని పలువురు అభిమానులు అడుగుతున్నారు. అదే సమయంలో డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం’ అని చెప్పడంతో షాక్ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుంది’’ అని నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
త్వరలో రాబోయే ఓటీటీ షోకి బిగ్‌బాస్ షోకి వ్యత్యాసం ఉంటుందా..?
నాగార్జున: ఇప్పటివరకూ చూసిన బిగ్‌బాస్ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు.
ఓటీటీలో కూడా మీరు వారంలో రెండు రోజులు కనిపిస్తారా?
నాగార్జున: బిగ్‌బాస్ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి? ఎంతమంది కంటెస్టెంట్స్? ఎన్ని రోజులు? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం.
బిగ్‌బాస్ సీజన్-6 ఉంటుందా? దానికి హోస్ట్ మీరేనా?
నాగార్జున: తప్పకుండా ఉంటుంది. నేనే వ్యాఖ్యాతగా కనిపిస్తాను.
సినిమాలు, బిగ్‌బాస్ ఓటీటీ.. మీరు ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నారా?
నాగార్జున: నాకు ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తా.
బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా?
నాగార్జున: సినిమా సిద్ధమైంది. దాన్ని గురించి వేరే చోట మాట్లాడుకుందాం.
బిగ్‌బాస్ సీజన్ పూర్తైనప్పుడు బాధపడ్డారా?
నాగార్జున: సీజన్ పూర్తైన ప్రతిసారీ నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్, టీమ్ అందరూ నాకు కుటుంబసభ్యుల్లా మారిపోయారు. కాకపోతే, ఇప్పుడు కాస్త రిలాక్స్‌గా విహారయాత్రలకు వెళ్లొచ్చు.
బిగ్‌బాస్-5 ఫినాలేకి బిగ్గెస్ట్ సెలబ్రిటీలు రావడానికి కారణం మీరేనా?
నాగార్జున: నేను కాదు.. అది కేవలం బిగ్‌బాస్ పాపులారిటీతోనే సాధ్యమైంది. వాళ్లే వస్తామని అడిగి వచ్చారు. మేము ఇంకా చాలామందికి వద్దని చెప్పాం.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఓటీటీలోకి విశ్వక్సేన్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదలైంది. -
న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాజల్, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ధన్య బాలకృష్ణన్ కొత్త వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సరికొత్త సిరీస్‌లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్లో మరో ఆసక్తికర సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘తంత్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం