Nani: ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు.. నాని సంచలన వ్యాఖ్యలు

సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని  అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే...

Published : 24 Dec 2021 01:14 IST

మీడియా సమావేశంలో నటుడి అసహనం

హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రబృందంతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని