Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద...

Published : 01 Dec 2021 16:03 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘పుష్పకవిమానం’. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందనలందుకుంది. ఆనంద్‌ దేవరకొండ నటన చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన స్కూల్‌ టీచర్‌ పాత్ర పోషించారు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో గీతాషైనీ, శాన్వి మేఘన, సునీల్‌, హర్షవర్ధన్‌, నరేశ్‌ కీలకపాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని