RRR: రామ్‌-భీమ్‌ ఇద్దరూ కలిసి వస్తున్నారు..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్...

Published : 30 Oct 2021 13:55 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొమురంభీమ్‌ పాత్రలో తారక్‌.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది.

నవంబర్‌ ఒకటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ గ్లిమ్స్‌ బయటకు రానుంది. 45 సెకన్ల నిడివితో రానున్న ఈ వీడియోలో చరణ్‌-తారక్‌ కలిసి కనిపించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్‌-చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు ఈసినిమాలో కీలకపాత్రలు షిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని