Gully Rowdy: ‘గల్లీ రౌడీ’ ఓటీటీలోకి వస్తున్నాడు..!

సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.

Updated : 30 Aug 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ రౌడీ కథ ఇది...

విశాఖ‌లో ఒక‌ప్పుడు పేరు మోసిన రౌడీ సింహాచ‌లం (నాగినీడు). త‌న వైభ‌వం కోల్పోయాక, త‌న కొడుకు మ‌ర‌ణించాక ఎలాగైనా త‌న మ‌న‌వ‌డు వాసు (సందీప్‌ కిష‌న్‌)ని రౌడీని చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. త‌న శ‌త్రువుపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెంచుతాడు. కానీ, వాసుకేమో రౌడీయిజం అంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. సాహిత్య (నేహాశెట్టి)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆమెకీ, ఆమె కుటుంబానికి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. అందుకోసం ‘గ‌ల్లీరౌడీ’గా చలామ‌ణీ అవుతున్న వాసుని ఆశ్ర‌యిస్తుంది. ఇంత‌కీ సాహిత్య కుటుంబానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమిటి? అందుకోసం వాసు ఏం చేశాడు? రౌడీ అయ్యి, శ‌త్రువుపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న తాత కోరిక‌ని ఎలా నెర‌వేర్చాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని