family man: మేకింగ్‌ స్టిల్స్‌పై ఫన్నీ క్యాప్షన్స్‌

జేమ్స్‌బాండ్‌ తరహాలో కుట్రలు, కుతంత్రాలను ఛేదించే కథాంశంతో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీమ్యాన్‌’. నిఘా, భద్రత విభాగంలో పనిచేస్తున్న కథానాయకుడికి ఓ కుటుంబం కూడా ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో తీసిన ఈ సిరీస్‌ ఓటీటీ తెరపై రక్తికట్టింది. టాస్క్‌ (థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌ సెల్‌) ఏజెంట్‌గా

Published : 06 Jul 2021 12:07 IST

జేమ్స్‌బాండ్‌ తరహాలో కుట్రలు, కుతంత్రాలను ఛేదించే కథాంశంతో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీమ్యాన్‌’. నిఘా, భద్రత విభాగంలో పనిచేస్తున్న కథానాయకుడికి ఓ కుటుంబం కూడా ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో తీసిన ఈ సిరీస్‌ ఓటీటీ తెరపై రక్తికట్టింది. టాస్క్‌ (థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌ సెల్‌) ఏజెంట్‌గా మనోజ్‌ బాజ్‌పాయ్‌, ఇంట్లో చిర్రుబుర్రులాడే గృహిణిగా ప్రియమణి, ఓ లక్ష్యం కోసం ఎంతకైనా తెగువ చూపే యువతిగా రాజీ పాత్రలో సమంత రెండో సీజన్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ‘ది ఫ్యామిలీమ్యాన్‌2’ విడుదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ షో క్రియేటర్స్‌ రాజ్‌&డీకే షూటింగ్ సమయంలో తీసిన 10 చిత్రాలను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ఫన్నీ క్యాప్షన్స్‌ రాసిన ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని