Ram: వారియర్‌... జోరు యార్‌

పుట్టినరోజుకి ఒక రోజు ముందే సందడి షురూ చేయనున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది వారియర్‌’ టీజర్‌ ఈ నెల 14న విడుదల కానుంది. ఆ విషయాన్ని ఆదివారం చిత్రబృందం ప్రకటించింది.

Updated : 09 May 2022 14:15 IST

పుట్టినరోజుకి ఒక రోజు ముందే సందడి షురూ చేయనున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది వారియర్‌’ టీజర్‌ ఈ నెల 14న విడుదల కానుంది. ఆ విషయాన్ని ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. 15న రామ్‌ పుట్టినరోజు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకి పచ్చజెండా ఊపిన రామ్‌... ‘ది వారియర్‌’ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనని పక్కా మాస్‌ అవతారంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. కెరీర్‌లో తొలిసారి పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. తెలుగు, తమిళ భాషల్లో  రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్జే విజిల్‌ మహాలక్ష్మి పాత్రలో కృతిశెట్టి నటిస్తోంది. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని