Dhanush: మరో ఓటీటీలోకి వచ్చిన ధనుష్‌ ‘తిరు’.. ఎక్కడంటే?

ధనుష్‌, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ తెరకెక్కించిన చిత్రం ‘తిరుచిత్రంబలం’. ఇప్పటికే ‘సన్‌నెక్స్ట్‌’ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా తాజాగా మరో ఓటీటీలోకి వచ్చింది.

Published : 06 Oct 2023 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒక ఓటీటీలో సందడి చేసే కొన్ని సినిమాలు నెలల వ్యవధిలో మరో ఓటీటీలో విడుదలవడం సాధారణం. ఏడాది దాటిన తర్వాత రిలీజ్‌ అయితే మాత్రం అది ఆశ్చర్యమే! ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో తిరు) (Thiruchitrambalam) ఈ రెండో కోవకే చెందుతుంది. ధనుష్‌ (Dhanush), నిత్యా మేనన్‌ (Nithya Menen), రాశీఖన్నా (Raashii Khanna) ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ఇది. 2022 ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అదే ఏడాది సెప్టెంబరులో ఓటీటీ ‘సన్‌నెక్స్ట్‌’లో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. అటు థియేటర్లలో, ఇటు ‘సన్‌నెక్స్ట్‌’ (Sun Next) వేదికగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లోకి వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

హీరోగా రాజీవ్‌ కనకాల తనయుడు.. టైటిల్‌ ప్రకటించిన రాజమౌళి.. పేరేంటంటే?

ఈ సినిమా క‌థేంటంటే: తిరు ఏకాంబ‌రం అలియాస్ పండు (ధ‌నుష్‌) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌. చిన్న‌ప్పుడు హుషారైన‌, తెలివైన కుర్రాడే. కానీ, త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో మధ్య‌లోనే కాలేజీ మానేస్తాడు. భ‌య‌స్తుడిలా మారిపోతాడు. త‌న తండ్రి (ప్ర‌కాష్‌ రాజ్‌), తాత సీనియ‌ర్ పండు (భార‌తీ రాజా)తో క‌లిసి జీవిస్తుంటాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ స్నేహితురాలైన శోభ‌న (నిత్యా మేన‌న్‌) కుటుంబం కూడా అదే అపార్ట్‌మెంట్‌లో కింద పోర్ష‌న్‌లో ఉంటుంది. ఒక‌రి గురించి ఒక‌రికి బాగా తెలిసిన ఆ ఇద్ద‌రి మ‌ధ్య దాపరికాలంటూ ఏమీ ఉండ‌వు. అనూష (రాశీ ఖ‌న్నా), రంజ‌ని (ప్రియా భ‌వానీ శంక‌ర్‌)ల‌పై తిరు మ‌న‌సు ప‌డ్డాడ‌ని తెలుసుకున్న శోభ‌న ఆ విష‌యంలో సాయం కూడా చేస్తుంది. మ‌రి, తిరు చివ‌రికి ఎవ‌రిని ప్రేమించాడు? అత‌ని జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న ఏమిటనేది మిగ‌తా క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని