Rajamouli: హీరోగా రాజీవ్‌ కనకాల తనయుడు.. టైటిల్‌ ప్రకటించిన రాజమౌళి.. పేరేంటంటే?

రాజీవ్‌ కనకాల, సుమ దంపతుల తనయుడు రోషన్‌ నటిస్తున్న తొలి సినిమా టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 07 Oct 2023 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు రాజీవ్‌ కనకాల (Rajeev Kanakala) తనయుడు రోషన్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అతడి తొలి సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా రోషన్‌ తనదైన మార్క్‌ చూపించాలని, తల్లిదండ్రులు సుమ, రాజీవ్‌ గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. దానిపై రోషన్‌ స్పందిస్తూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీ ప్రతి సినిమా నాపై ఎంతో ప్రభావం చూపింది’ అని పేర్కొన్నాడు. ఇంతకీ సినిమా పేరేంటంటే.. ‘బబుల్ గమ్‌’ (Bubble Gum). పేరుకు తగ్గట్లు సంబంధిత పోస్టర్‌లో బబుల్‌ గమ్‌ నములుతూ కనిపించాడు రోషన్‌. యువత లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

రవితేజకు క్షమాపణలు చెప్పిన అనుపమ్‌ ఖేర్‌.. ఎందుకంటే!

రవికాంత్‌ పేరేపు (Ravikanth Perepu) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ చిత్రాలతో మెప్పించిన దర్శకుడాయన. రోషన్‌ సరసన చెరుకూరి మానస చౌదరి నటిస్తోంది. ఆమెకీ ఇదే తొలి సినిమా. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 10న గ్లింప్స్‌ను విడుదల చేయనన్నట్లు చిత్ర బృందం తెలిపింది. గతేడాదే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం నాకే ఇస్తారని ఆశిస్తున్నానంటూ సుమ అప్పుడు నవ్వులు పంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని