Nagarjuna: 1,080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని నటుడు నాగార్జున దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో...

Updated : 17 Feb 2022 18:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని నటుడు నాగార్జున దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి చెంగిచర్లలో కుటుంబ సమేతంగా అర్బన్‌ ఫారెస్ట్‌ ఏర్పాటుకు నాగార్జున శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అభివృద్ధికి హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రూ.2 కోట్ల చెక్‌ను అటవీ శాఖ ఉన్నతాధికారులకు నాగార్జున అందించారు.

‘‘మన పరిసరాలు, రాష్ట్రం, దేశం ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొని పలుమార్లు మొక్కలు నాటాను. అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడంపై ఎంపీ సంతోష్‌తో గతంలోనే చర్చించాను. అనుకున్నట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ఇవాళ శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉంది. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని నాగార్జున అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవిని దత్తత తీసుకునేందుకు నాగార్జున ముందకు రావడాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. అర్బన్ ఫారెస్టు పార్కు అభివృద్ధితో పాటు ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించనున్నట్లు సంతోష్‌ కుమార్‌ వెల్లడించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు