Dolly: సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి..

హిందీ నటి డాలీ సోహి ముంబయిలో శుక్రవారం ఉదయం మరణించారు.

Updated : 08 Mar 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలివిజన్ నటి డాలీ (Dolly Sohi) సోహి కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు ’ అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

హిందీలో పలు సీరియల్స్‌లో నటించిన డాలీ చివరిసారి గతేడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా.. సులభం అవుతుంది. క్యాన్సర్‌ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా.. లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది’ అని అందరిలో ధైర్యాన్ని నింపారు. హిందీలో 'ఝనక్', 'మేరీ ఆషికీ తుమ్సే హి' వంటి సీరియల్స్‌తో డాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఆమె మరణంతో హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని