
Samantha: మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత.. ఈసారి గూఢచారిగా!
ఇంటర్నెట్‌డెస్క్: అగ్రకథానాయిక సమంత (Samantha) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలకు ఓకే చెప్పిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ఆమె నటిస్తున్న అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘సిటాడెల్’(Citadel). ‘ఫ్యామిలీమ్యాన్’ సృష్టికర్తలు రాజ్-డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. గూఢచర్యం నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. వరుణ్ ధావన్, సమంత తొలిసారి కలిసి నటిస్తుండగా.. ఇద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారట. ఈ సిరీస్ సెట్స్‌పైకి వెళ్లే ముందు వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు చాలా స్టైలిష్‌గా ఉంటాయని బాలీవుడ్ టాక్.
‘అవెంజర్స్’ వంటి సూపర్‌హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ అమెజాన్ ప్రైమ్ సిరీస్ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అన్నట్లు ‘సిటాడెల్’ పేరుతో అమెరికాలో ఓ యాక్షన్ స్పై థ్రిల్లర్ తెరకెక్కుతోంది. దీన్ని కూడా రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులతో ఆ సిరీస్‌ను వరుణ్, సమంతతో తెరకెక్కిస్తున్నారట. ఇటీవల ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టిన సమంత.. ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.