Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో డేట్‌ చేస్తానన్న సారా.. రౌడీ ఏమన్నారంటే..?

టాలీవుడ్‌ సెన్సేషల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో(Vijay Devarakonda) డేట్‌ చేయాలని ఉందంటూ బాలీవుడ్‌ యువ నటి సారా అలీఖాన్‌(Sara Alikhan) ఇటీవల...

Updated : 13 Jul 2022 10:45 IST

ముంబయి‌: టాలీవుడ్‌ సెన్సేషల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో(Vijay Devarakonda) డేట్‌ చేయాలని ఉందంటూ బాలీవుడ్‌ యువ నటి సారా అలీఖాన్‌(Sara Alikhan) ఇటీవల ఓ షోలో మదిలోని మాట బయటపెట్టిన సంగతి తెలిసిందే. తన గురించి సారా చేసిన వ్యాఖ్యలపై విజయ్‌ దేవరకొండ తాజాగా స్పందించారు. హార్ట్‌ సింబల్‌ జతచేర్చి ప్రేమ, ఆప్యాయతను ఆమెకు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తన స్టైల్‌, స్టార్‌డమ్‌తో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎంతోమంది భామల హృదయాలు కొల్లగొట్టారు విజయ్ దేవరకొండ (Vijay Devarakona). విజయ్‌కున్న మాస్‌ ఫాలోయింగ్‌కి అక్కడివారూ మనసు పారేసుకున్నారు. బాలీవుడ్‌ యువ నటీమణులు సారా అలీఖాన్‌ (Sara Alikhan),  జాన్వీకపూర్‌(Janhvi Kapioor) ఆ జాబితాలోకి చేరారు. కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌-7లో వీరిద్దరూ పాల్గొన్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో మంగళవారం బయటకు వచ్చింది. ‘నువ్వు ఎవరితోనైనా డేట్‌ చేయాలనుకుంటున్నావా?’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘విజయ్‌ దేవరకొండ’ అని సారా సమాధానమిచ్చారు. అనంతరం ‘నువ్వూ విజయ్‌తోనేనా’ అని కరణ్‌.. జాన్వీని అడగ్గా ఆమె నవ్వుతో సమాధానమిచ్చింది. తాజాగా ఈ వీడియో చూసిన విజయ్‌.. ‘‘మీ ఇద్దరికీ కౌగిలింతలు, ప్రేమ, ఆప్యాయతను పంపుతున్నా’’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

త్వరలో విడుదల కానున్న ‘లైగర్‌’తో(Liger) విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై కరణ్‌జోహార్‌ (Karan Johar) నిర్మిస్తున్నారు. కిక్‌ బాక్సింగ్‌ కథాంశంతో సిద్ధమైన ఈసినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. మరోవైపు ఆయన సమంతతో ‘ఖుషి’, పూజాహెగ్డేతో ‘జనగణమన’ చేస్తున్నారు. ఇక, ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ‘కాఫీ విత్ కరణ్‌’ ఏడో సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రసారం అవుతోంది. మొదటి ఎపిసోడ్‌లో ఆలియా, రణ్‌వీర్‌ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్‌లో సారా, జాన్వీకపూర్‌ అలరించనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని