Vijay Deverakonda: డేటింగ్‌ లైఫ్‌.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్‌ దేవరకొండ

తాను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానో చెప్పి, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ...

Published : 14 Aug 2022 13:27 IST

ఇప్పుడే బీటౌన్‌ స్క్రిప్ట్స్‌ ఓకే చేయను

హైదరాబాద్‌: తాను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానో చెప్పి.. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన పర్సనల్‌ లైఫ్‌, రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై స్పందించారు. ‘‘నా వ్యక్తిగత సంబంధాల గురించి అందరితో చెప్పడం నాకిష్టం లేదు. నాతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు. ఒక నటుడిగా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండటానికి నాకు ఇష్టం ఉన్నా.. పబ్లిక్‌లో ఫోకస్‌ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు’’ అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

బీటౌన్‌ స్క్రిప్ట్‌లు..

‘‘బీటౌన్‌లో నేను ఇప్పటివరకూ ఏ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పలేదు. నాలో ఉత్సుకత పెంచే స్క్రిప్ట్‌లు ఏమీ రాలేదు. ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయాలనుకోవడం లేదు. ‘లైగర్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసి.. దాని సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ‘ఖుషి’, ‘జనగణమన’ పూర్తి చేయాలనుకుంటున్నా. కొన్ని నెలల తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లు ఓకే చేసే పనిలో పడతా’’

ఆయనకు మాటిచ్చా..

‘‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత ఓసారి ముంబయిలో కరణ్‌ జోహార్‌ని కలిశా. ఈ సినిమాలో నా నటన ఆయనకెంతో నచ్చింది. నాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో నేనందుకు సిద్ధంగా లేను. ‘లైగర్‌’ స్క్రిప్ట్‌ విన్నాక, ఈ సినిమాకి నిర్మాతగా ఉండేందుకు ఆయన అంగీకారం తెలిపారు. సరైన వ్యక్తి సినిమాపైనే పెట్టుబడి పెట్టానని సంతోషించేలా చేస్తానని ఆయనకు మాటిచ్చా’’

నాకెలాంటి భయం లేదు..

‘‘లైగర్‌’ విషయంలో నేనెంతో నమ్మకంగా ఉన్నా. ఈసినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. కాకపోతే నాకున్న ఒకే ఒక్క టెన్షన్‌.. హైదరాబాద్‌కు చెందిన నేను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఎలా చేరువకాగలననే’’

మద్యం వదిలేశా..

‘‘ఈ సినిమాలోని నా పాత్రను ప్రేక్షకులందరూ ఇష్టపడతారు. నేను నత్తితో మాట్లాడటాన్ని కూడా వాళ్లు ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో పాత్ర కోసం ఫిట్‌నెస్‌ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. ముఖ్యంగా మద్యం వదిలేశా’’

లోకేశ్‌ నుంచి కాల్‌..

‘‘లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌’ చూశా. ఆయన సినిమాటిక్‌ ప్రపంచంలో నేనూ భాగం కావాలనుకుంటున్నా. త్వరలోనే ఆయన నుంచి నాకు ఫోన్‌ కాల్‌ వస్తుందనుకుంటున్నా. భవిష్యత్తులోనైనా ఆయనతో సినిమా చేస్తా’’ అని విజయ్‌ దేవరకొండ వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని