Vijay Deverakonda: పాపులారిటీతోనూ సమస్యలొస్తాయి: ఈడీ విచారణ అనంతరం విజయ్‌

నటుడు విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు సుమారు 11 గంటలపాటు విచారించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

Updated : 30 Nov 2022 22:12 IST

హైదరాబాద్‌: ‘మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి. వాటిల్లో ఇదొకటి’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ అనంతరం నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ‘‘మీరు చూపించే అభిమానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు’’ అని విజయ్‌ తెలిపారు.

తాను కథానాయకుడిగా తెరకెక్కిన ‘లైగర్‌’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాత ఛార్మిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం విజయ్‌ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు విజయ్‌పై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. దుబాయికి డబ్బులు పంపించి, అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ‘లైగర్‌’లో భాగస్వాములైన వారిని అధికారులు విచారిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని