Vijay Varma: తమన్నాతో ప్రేమ.. ఆ విషయానికి అలవాటుపడుతున్నా: విజయ్‌ వర్మ

బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ (vijay varma), నటి తమన్నా (tamannaah) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Updated : 19 Aug 2023 14:00 IST

ముంబయి: తమన్నా (Tamannaah Bhatia)తో ప్రేమాయణంపై నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma) మరోసారి మాట్లాడారు. ‘‘ప్రేక్షకుల ఆదరణ పొందిన జంటల్లో మేము కూడా ఉన్నామనేది నాకు ఇప్పటివరకూ తెలియదు. ఇది నాకొక న్యూస్‌. వాళ్ల ఆదరణ సొంతం  చేసుకున్నందుకు ఆనందిస్తున్నా. మొదట్లో నేను ఇలా ఉండేవాడిని కాదు. మేమిద్దరం ప్రేమలో పడిన తర్వాత బయటకు వెళ్లినప్పుడు.. అందరి దృష్టి మాపై పడింది. మా పర్సనల్‌ లైఫ్‌ లైమ్‌లైట్‌లోకి రావడం పట్ల మొదట్లో అసౌకర్యంగా ఫీలయ్యా. రాను రాను నేను కూడా దానికి అలవాటు పడుతున్నా’’ అని ఆయన చెప్పారు.

Social Look: వరుణ్‌ - లావణ్య డేట్‌.. హృతిక్‌ సిక్స్‌ ప్యాక్‌.. అక్కినేని ఫ్యామిలీ పిక్‌

‘లస్ట్‌స్టోరీస్‌ 2’ కోసం మొదటిసారి కలిసి వర్క్‌ చేశారు విజయ్‌ వర్మ - తమన్నా. ఆ సిరీస్‌ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని తమన్నా గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలానే ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే నాకు విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకు కష్టం వస్తే నాతోనే ఉంటాడనే నమ్మకం ఉంది’’ అని తమన్నా తెలిపారు. తమన్నాతో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని విజయ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని