‘పసలపూడి వీరబాబు’గా కార్తి.. నేరుగా ఓటీటీలో తెలుగు వెర్షన్‌ చూసేయండి

కార్తి కథానాయకుడిగా తమిళంలో నటించిన ‘విరుమన్‌’ చిత్రాన్ని ‘పసలపూడి వీరబాబు’గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలుగు వెర్షన్‌ విడుదల చేసింది.

Updated : 01 Oct 2022 17:37 IST

హైదరాబాద్‌: తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న నటుడు కార్తి (Karthi). ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అయితే, ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విరుమన్‌’ (Viruman) తెలుగు వెర్షన్‌ మాత్రం విడుదల చేయలేదు. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తమిళ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ తీసుకొచ్చారు. ఈ సినిమా చూడలేకపోయామే అని బాధపడుతున్న తెలుగు అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తీపి కబురు చెప్పింది. ‘విరుమన్‌’ను ‘పసలపూడి వీరబాబు’ (Pasalapoodi Veerababu) గా అందుబాటులో తెచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో ముత్తయ్య దీన్ని తెరకెక్కించారు. అగ్ర దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రాజ్‌కిరణ్‌, సూరి కీలక పాత్రలు పోషించారు. మాస్‌ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని