ఆయన అభిప్రాయాలతో ఏ మాత్రం ఏకీభవించను. మరి, మీరు అంగీకరిస్తారా?

కరోనా ముందు వరకూ భారతీయ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్‌ ఇప్పుడు వరుస పరాజయాలు చవిచూస్తోంది. బీటౌన్‌ స్టార్‌ హీరోల సినిమాలు సైతం విజయాన్ని అందుకోలేపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ వైఫల్యంపై అనురాగ్‌ చేసిన వ్యాఖ్యలను వివేక్‌ అగ్నిహోత్రి తప్పుబట్టారు.

Published : 14 Dec 2022 16:42 IST

ముంబయి: బాలీవుడ్‌ వైఫల్యం చెందడానికి దక్షిణాది నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు కారణమంటూ ఇటీవల బీటౌన్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై మరో బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి స్పందించారు. అనురాగ్‌ మాటలను తప్పుపట్టిన ఆయన వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ట్వీట్‌ పెట్టారు. అనురాగ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. ‘‘బాలీవుడ్‌లోని ఏకైక జెంటిల్‌మ్యాన్‌ అభిప్రాయాలను నేను ఏ మాత్రం ఏకీభవించను. మరి, మీరు అంగీకరిస్తారా?’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు వివేక్‌కు మద్దతు పలుకుతుండగా.. మరి కొంతమంది, అనురాగ్‌ ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకుని కామెంట్‌ చేస్తే బాగుండేదని అంటున్నారు.

2022 చివరి దశకు చేరుకున్న కారణంగా ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ సైట్‌ భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో చర్చా సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న అనురాగ్‌.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు ఫెయిల్‌ కావడంపై స్పందించారు. ‘‘ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా ట్రెండే కనిపిస్తోంది. కాంతార(Kantara), పుష్ప(Pushpa) లాంటి సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సాధించాయి. బాలీవుడ్‌లో వాటిని అనుకరిస్తూ సినిమాలు తీస్తే అవి అనుకున్నంతస్థాయిలో ఆడటం లేదు. ఇలాంటి ప్రయత్నాలే బాలీవుడ్‌కు భారీ నష్టాలు తెస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్‌ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్‌ అవుతాయి’’ అని అనురాగ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని