Waltair Veerayya: డోంట్‌ స్టాప్ షౌటింగ్‌.. థియేటర్లలో పూనకాలు లోడింగ్‌

చిరంజీవి (Chiranjeevi) - బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌  ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. రవితేజ (Raviteja) కీలకపాత్ర పోషించారు. శుక్రవారం ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Published : 13 Jan 2023 08:27 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ (Bobby) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 థియేటర్లలో ఇది విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ మాస్‌ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్‌ మార్‌ డ్యాన్స్‌లతో థియేటర్‌ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. 

థియేటర్లలోనూ మాస్‌ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్‌ స్టెప్పులు, ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌, రవితేజ-చిరు కాంబో సీన్స్‌ టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు. మరోవైపు, చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని