మహిళా పోలీసులకు వుమెన్స్‌ డే ఆఫర్‌.. ఉచితంగా ఆ మూవీ వీక్షించవచ్చు..!

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మహిళా పోలీసులకు స్పెషల్‌ షోస్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Updated : 08 Mar 2022 21:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మహిళా పోలీసులకు ప్రత్యేక సినిమా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పవన్‌ కల్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమాని 1200 మంది ఉద్యోగుల కోసం స్పెషల్‌ షో వేస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్స్ నుంచి ఉన్నత స్థాయి మహిళా ఉద్యోగులు ఈ సినిమాని వీక్షించవచ్చన్నారు. కాగా.. సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఐనాక్స్‌ జీవీకే మాల్‌లో ఈ స్పెషల్‌ షోస్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని