Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ ఉచిత ప్రదర్శన.. థియేటర్ల జాబితా ఇదే!
‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రాన్ని మహిళల కోసం ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయించింది.
హైదరాబాద్: సుహాస్ (Suhas) హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan). పోస్టర్లు, ట్రైలర్‌తోనే సినీప్రియులను ఆకర్షించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫీల్ గుడ్ మూవీగా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కథపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది. బుధవారం (ఫిబ్రవరి8) రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. దీని కోసం 38 థియేటర్లు ఎంపిక చేశారు.
మహేశ్ బాబు ప్రశంస.. సుహాస్ భావోద్వేగం..
సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమా సినీప్రియుల మనసుల్ని గెలుచుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసి స్టార్ హీరో మహేశ్ బాబు(Mahesh Babu) చిత్రబృందాన్ని ప్రశంసించారు. సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసినట్లు మహేశ్ తెలిపారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని ఆయన పేర్కొన్నారు. సినిమాలో నటీనటులు చాలా బాగా నటించారని ప్రశంసిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. దీనికి సుహాస్ (Suhas) భావోద్వేగానికి గురవుతూ మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్