Yami Gautam: వైభ‌వంగా యామీ వివాహం

నువ్విలా, గౌర‌వం, యుద్దం, కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌  బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.  

Published : 04 Jun 2021 19:58 IST

ముంబ‌యి: ‘నువ్విలా’, ‘గౌర‌వం’, ‘యుద్ధం’, ‘కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌’.. చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌  బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధ‌ర్‌తో క‌లిసి ఆమె ఏడడుగులు వేశారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా అతి త‌క్కువ మంది బంధువుల స‌మ‌క్షంలో శుక్ర‌వారం వీరి క‌ల్యాణం వైభ‌వంగా జ‌రిగింది. ఈ శుభ‌వార్త‌ని అభిమానుల‌తో పంచుకుంటూ ఓ ఫొటోని షేర్ చేసింది యామీ. ఇందులో సంప్ర‌దాయ వ‌స్త్రాల్లో క‌నిపించి చిరు నవ్వులు చిందించారు. దీన్ని చూసిన సినీ తార‌లు, అభిమానులు నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. గ‌తంలో ‘ఉరి: ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌’ చిత్రం కోసం ఆదిత్య‌- యామీ కలిసి ప‌నిచేశారు. యామీ.. ఫెయిర్ అండ్ ల‌వ్లీ ప్ర‌క‌ట‌న‌తో విశేషంగా ఆక‌ట్టుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని